Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - తెలుగు రాశిఫలాలు
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 16) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశి ఫలాలు
By
Published : Dec 16, 2022, 6:29 AM IST
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 16) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. ఇష్టదైవ నామాన్ని జపించాలి.
మనోధైర్యాన్ని కోల్పోకండి. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్య విషయాల్లో అశ్రద్ధ రానీయకండి. ఇష్టదైవ ప్రార్థన శుభాలను కలుగజేస్తుంది.
మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
ప్రయత్న కార్యసిద్ధి కలదు. మానసికంగా ధృడంగా ఉంటారు. కలహాలకు తావివ్వరాదు. ఇష్టదైన ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.
ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.
గ్రహబలం అనుకూలిస్తోంది. స్వల్ప ధనలాభం ఉంది. అనవసర తగాదాలకు తావివ్వకండి. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
లక్ష్యంపై మనస్సు లగ్నం చేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ఇష్ట దైవారాధన శుభప్రదం.
తోటివారి సహకారం లభిస్తుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. గిట్టనివారితో మితసంభాషణం చేయడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.