తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope latest news

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 15) రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..

horoscope today
horoscope today

By

Published : Feb 15, 2023, 6:16 AM IST

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 15) రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..

వృత్తి,ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

అనుకూల ఫలితాలు ఉన్నాయి.ముఖ్య విషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్ని విషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి, మంచి చేకూరుతుంది.ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంభించడం మంచిది. గోసేవ చేయడం ఉత్తమం.

ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.

మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

మంచికాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు.మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీస్తుతి చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం మంచిది.

మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్పఫలితాలను తెచ్చి పెడుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. నూతన వస్తువులు మీ ఇంటికి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా మంచిది.

మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. దుర్గారాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details