Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope today in telugu
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 11) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
horoscope today
By
Published : Feb 11, 2023, 6:12 AM IST
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 11) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
శుభకాలం. అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన చేస్తే మంచిది.
చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనః పీడ ఉంది. మానసిక ప్రశాంతతకై శివ నామాన్ని జపించడం ఉత్తమం.
పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మనఃశ్శాంతిని తగ్గిస్తుంది. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.
మొదలుపెట్టిన పనులలో ఇబ్బందులను అధికమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇది మీకు మంచి సమయం. మొదలు పెట్టిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తిచేయ గలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
లక్ష్యంపై ఎకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అక్కరకు వస్తాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గ ధ్యానం శుభప్రదం.
మొదలు పెట్టిన పనులలో విజయం వరిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్లు వాయిదా వేసుకుంటే మంచిది. కలహ సూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకుసాగితే అన్ని సర్దుకుంటాయి. సూర్య ఆరాధన మంచి చేస్తుంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
గ్రహబలం విశేషంగా ఉంది. ఇది మీకు శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.