ఈరోజు (26-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు; ఆశ్వయుజ మాసం
బహుళపక్షం షష్ఠి: పూర్తి; ఆర్ద్ర: తె. 4.06 తదుపరి పునర్వసు
వర్జ్యం: ఉ. 10.56 నుంచి 12.42 వరకు
అమృత ఘడియలు: సా. 5.06 నుంచి 6.51 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.18 నుంచి 9.04 వరకు తిరిగి రా. 10.30 నుంచి 11.20 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6.00, సూర్యాస్తమయం: సా.5-30
మేషం
పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండవలసిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
వృషభం
చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. దుర్గాస్తుతి పఠించాలి.
మిథునం
మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలు సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. రుణబాధ ఎక్కువ. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. శివాష్టకాన్ని చదివితే మంచిది .
కర్కాటకం
అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకుసాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.
సింహం
శుభకాలం. మొదలుపెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. శివ సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.
కన్య
శ్రమఫలిస్తుంది. తోటివారి సహకారంతో ఇబ్బందులు తొలుగుతాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
తుల
మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి ఆలోచించి మాట్లాడాలి లేని యడల అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం చదివితే మంచిజరుగును.
వృశ్చికం
ధర్మసిద్ధి ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. గురుశ్లోకం చదవాలి.
ధనుస్సు
శుభ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో అనుకున్నది దక్కుతుంది. తోటివారి సహకారం ఉంది. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.
మకరం
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనా పఠించాలి.
కుంభం
ఆత్మబలంతో పోరాడి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి కలదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మంచిది
మీనం
సత్ఫలితాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (అక్టోబరు 24 - అక్టోబరు 30)