తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (08-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈనాడు రాశి ఫలాలు

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశిఫలాలు

By

Published : Nov 8, 2021, 4:51 AM IST

ఈరోజు(8-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తీక మాసం; శుక్లపక్షం

చవితి: సా. 6.14 తదుపరి పంచమి

మూల: రా.12.24 తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం: ఉ. 9.28 నుంచి 10.58 వరకు తిరిగి రా. 10.54 నుంచి 12.24 వరకు

అమృత ఘడియలు: సా.6.25 నుంచి 7.35 వరకు

దుర్ముహూర్తం: మ.12.07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2.22 నుంచి 3.08 వరకు

రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

సూర్యోదయం: ఉ.6.05, సూర్యాస్తమయం: సా.5-24

నాగులచవితి

మేషం

కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. కుటుంబసభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. లలితాదేవి నామాన్ని స్మరించాలి.

వృషభం

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభం చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చంద్రధ్యానం శుభప్రదం.

మిథునం

మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.


కర్కాటకం

స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివుద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.

సింహం

చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

కన్య

మిశ్రమకాలం. శారీరక శ్రమ పెరగవచ్చు. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయల్లో ప్రశాంతంగా ఆలోచించండి మంచి చేకూరుతుంది. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠించాలి.

తుల

వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో పరిరక్షణ అవసరం. మానసిక ప్రశాంతత కోసమై వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

వృశ్చికం

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలు చేయకండి శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర శనామావళి పఠించడం మంచిది

ధనుస్సు

ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బుకు చేతికి అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

మకరం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

కుంభం

శ్రమతోకూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది . ఇష్టదైవారాధన శుభప్రదం.

మీనం

అనుకున్న పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వలన సంతోషంగా ఉంటారు. దుర్గాస్తుతి పఠించాలి.

ABOUT THE AUTHOR

...view details