తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? (20-05-2022) - రాశి ఫలాలు today

Horoscope Today (20-05-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
HOROSCOPE TODAY

By

Published : May 20, 2022, 4:22 AM IST

Horoscope Today(20-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

గ్రహం అనుగ్రహం:శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; వైశాఖమాసం; బహుళపక్షం పంచమి: రా.10-24 తదుపరి షష్ఠి; పూర్వాషాఢ: ఉ.7-50, తదుపరి ఉత్తరాషాఢ; వర్జ్యం: మ. 3-18 నుంచి 4-47 వరకు; అమృత ఘడియలు: రా. 12-16 నుంచి 1-46 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-04 నుంచి 8-55 వరకు తిరిగి 12-21 నుంచి 1-12 వరకు; రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు; సూర్యోదయం: ఉ.5.30, సూర్యాస్తమయం: సా.6.21

ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీ దేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.

మీ ఓర్పునకు ఇది పరీక్షాకాలం. మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామ రక్షాస్తోత్రం చదవడం శుభప్రదం.

సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్ట దేవతా సందర్శనం శుభకరం.

శుభకాలం. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు,మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.శివ సందర్శనం మంచి ఫలితాన్నిఇస్తుంది.

ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఇష్ట దైవారాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శివారాధన చేయాలి.

దైవబలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతికవిజయం సాధిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవారాధన మరింత శుభాన్ని ఇస్తుంది.

సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచిఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్ట దైవదర్శనం శుభప్రదం.

ప్రయత్న కార్యసిద్ది కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులకు పోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.

శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.

బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది.


ABOUT THE AUTHOR

...view details