తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశిఫలం ఎలా ఉందంటే? (04-06-2022 ) - HOROSCOPE TODAY

Horoscope Today (04-06-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today: ఈ రోజు రాశిఫలం ఎలా ఉందంటే? (04-06-2022 )
Horoscope Today: ఈ రోజు రాశిఫలం ఎలా ఉందంటే? (04-06-2022 )

By

Published : Jun 4, 2022, 4:56 AM IST

Horoscope Today(04-06-2022): ఈ రోజు గ్రహబలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

అనుభవజ్ఞులు సూచించిన మార్గంలో ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. ధనలాభం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మనఃస్సౌఖ్యం కలదు. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి . హనుమాన్ చాలీసా చదవాలి.

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఒకరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. సూర్యాష్టకం చదివితే ఇంకా బాగుంటుంది.

ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారాలలో ఊహించని ఫలితాలు వస్తాయి. అవి మీకు సంతోషాన్నికలిగిస్తాయి. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహాలక్ష్మిని ఆరాధించాలి.

చేసే పనిలో మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన కొన్ని ఫలితాలను పొందడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆదిత్య హృదయం చదవాలి.

బుద్ధిబలం బాగుంటుంది. కీలక భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. కొత్త ఆలోచనలు చేసి వాటిని ఆచరణలో పెడతారు. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. బంధు,మిత్రులను ఆదరిస్తారు. శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు అండదండలు లభిస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ శుభప్రదం.

అనుకూల సమయం కాదు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు,మిత్రులతో మాట పట్టింపులకు పోవద్దు. చెడు సావాసాలు చేయరాదు. కీలక విషయాల్లో అశ్రద్ధగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. విష్ణు సహస్ర నామాలను చదవాలి.

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దుర్గామాత దర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్పలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

బద్ధకాన్ని దరిచేరనీయకండి. ప్రారంభించిన పనులలో ముందుకు వెళతారు. ఆర్ధిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలుగుతాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details