తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (27-04-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

Horoscope Today (27-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
రాశిఫలాలు

By

Published : Apr 27, 2022, 4:34 AM IST

Horoscope Today (27-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం; బహుళ పక్షం

ద్వాదశి: రా. 1.23 తదుపరి త్రయోదశి పూర్వాభాద్ర: సా. 6.20 తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం: తె. 3.56 నుంచి 5.32 వరకు

అమృత ఘడియలు: ఉ.10.28 నుంచి 12.03 వరకు దుర్ముహూర్తం: ఉ.11.31 నుంచి 12.21 వరకు రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.5.40, సూర్యాస్తమయం: సా.6.13

మనోబలంతో చేసే పనులు సఫలమవుతాయి. ముఖ్య పనులను ఉదయమే ప్రారంభించడం మంచిది. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. చంద్ర ధ్యానం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మానసికంగా ద్రుఢంగా ఉండి, ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇష్టదేవతా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది

బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

నీరసించకుండా పనిచేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. చిన్నచిన్న విషయాలను సాగదీయకండి. మనస్కరించనప్పుడు దూరంగా ఉండడం మేలు. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది.

ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. స్వతహాగా ఎదగడానికి ఇది సరైన కాలం. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. వేంకటేశ్వర శరణాగతిస్తోత్రం పఠించడం మంచిది.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మనఃశసౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధన, ధాన్య లాభాలున్నాయి. సత్యనిష్ఠతో విజయసిద్ధి ఉంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

మిశ్రమ ఫలితాలున్నాయి. భవిష్యత్ కు ప్రణాళికలు వేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగ్రహావేశాలకు పోకూడదు. శని శ్లోకం చదవాలి.

అభివృద్ధివైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అన్నివిధాలా బాగుంటుంది. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

మీ మీ రంగాల్లో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గణపతిని పూజిస్తే మంచిది.

ABOUT THE AUTHOR

...view details