తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే? - telugu panchangam

Horoscope Today: ఈ రోజు (ఏప్రిల్​ 12) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today
Horoscope Today

By

Published : Apr 12, 2023, 6:12 AM IST

Horoscope Today : ఈ రోజు (ఏప్రిల్​ 12) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మీరు మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే అది మీ పనిని మాత్రమే గాక మీ సంబంధాలను కూడా పాడుచేస్తుంది. ఉద్రిక్తత, శత్రుత్వం మీరు మీ పని పై దృష్టి పెట్టకుండా చేస్తాయి. మీరు ఈరోజు కాస్త అనారోగ్యంగా ఉంటారు. మీరు ఒక ధార్మిక ప్రదేశాన్ని దర్శిస్తారు. శుభప్రదమైన కార్యక్రమానికి ఆహ్వానం అందుతుంది.

పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయవచ్చు, కానీ అంత త్వరగా విజయం లభించదు. మీరు నీరసంగా భావించవచ్చు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి కచ్చితంగా ఇది మంచి సమయం కాదు. మీ ప్రయాణంలో ఆటంకాలు ఉన్నాయి. తినే ఆహారం గురించి జాగ్రత్త వహించండి. వస్తు, లాభాల వెంట పడకుండా.. ధ్యానం, ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపాలి.

ఈ రోజు మీకు భౌతిక తృప్తి, ఆనందం ఉంది. మీరు అనుకోని వ్యక్తులను కలుసుకోవచ్చు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా ట్రిప్​కు వెళ్లి రావచ్చు. మీరు కొత్త బట్టల కోసం షాపింగ్​కు వెళ్లవచ్చు. శారీరకంగా మీ ఫిట్ నెస్, సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు అన్నీ ఉన్నత స్థాయిలో ఉంటాయి.

మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో వాతావరణం విపరీతమైన ఆనందోత్సాహాలతో ఉండవచ్చు. మీరు ఈ రోజు పూర్తి చేసిన పనులకు ఈ రోజే మెప్పు లభిస్తుంది. శారీరకంగా మీరు ఫిట్​గా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడుపుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు చాలా మంచి రోజు. మీరు మహిళా స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ ఓటమి పాలైనట్టే.

మీరు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. మీ కల్పనా శక్తి వెయ్యింతలవుతుంది. ప్రకృతి పరంగా కవితలు రాసేందుకు తగిన ప్రేరణ ఉంటుంది. ప్రియమైనవారిని కలుసుకుని ఆనందిస్తారు. మీరు మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి సమాచారం అందుకుంటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. మహిళా స్నేహితుల నించి లబ్ధి ఉండవచ్చు. మీరు దాన సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈరోజు ప్రతికూలతతో నిండి ఉండవచ్చు. మీరు శారీరకంగా చలాకీగా ఉండకపోవచ్చు. ఆందోళనలు మీ మనసును పీడించవచ్చు. మీ జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలకు చాలా అవకాశం ఉంది. మీ తల్లి అనారోగ్యం మీకు ఆందోళన కలిగించవచ్చు. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

ఈ రోజు మీకు చాలా ప్రొడక్టివ్​గా గడుస్తుంది. మీ సోదరులతో, సంబంధీకులతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఒక తీర్థయాత్ర ఉండవచ్చు. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. బయటి ప్రదేశాల్లో నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, కొత్త ప్రదేశాలు తిరిగి వస్తారు. ఈ రోజు కొత్త విషయాలేవైనా మొదలుపెట్టడానికి సరైన రోజు. శారీరకంగా, మానసికంగా చెదరకుండా ఉంటారు. ఈ రోజు పెట్టుబడి చేసేవారికి చాలా బాగుంటుంది.

మీరు మీ ఇంట్లో సామరస్యంగా మెలగాలంటే మీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. మీ దురుసు ప్రవర్తనతో మీరు ఈరోజు ఒకరిని బాధించవచ్చు. అందువల్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతికూలత మీ మనసును ఆవహించనివ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉంది.

మీరు పుణ్యక్షేత్రాలను దర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోజు చేద్దామన్నా పనులు చక్కగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు శారీరకంగా మానసికంగా చాలా ఆనందంగా వుంటారు. అందువల్ల మీరు మీ మీద నమ్మకంతో ఉల్లాసంగా వుంటారు. ఈ ఇంట్లో ఒక శుభసంధర్బం జరిగే అవకాశం వుంది. మీరు ప్రేమించే వ్యక్తిని కలసి ఆనందంగా గడిపే అవకాశం ఉంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

ఈ రోజు మీరు ఆధ్యాత్మికమైన విషయాలపై దృష్టి సాధిస్తారు. కొంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కోర్టుకు సంభందించిన విషయాల్లో మీరు శ్రద్ధ వహించండి. మీరు ఏ పనిపైనా అంతగా ఇష్టం చూపలేరు. ఏ ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోండి.

ఏర్పరుచుకున్న లక్ష్యాలు ఎలా ఛేదించాలనే దానిపై కసరత్తు చేస్తూ ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. మీకు కావాల్సిన మార్గాన్ని మీరు ఏర్పరుచుకుంటారు. కావాల్సింది నెరవెర్చుకోవడానికి మీలో తగిన సామర్థ్యం, శక్తి మీలో ఉందని తెలుసుకోండి.

అద్భుతమైన రోజు మీకోసం ఎదురుచూస్తోంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీకు అప్పగించిన పనులు మీరు గడువు కంటే ముందే పూర్తి చేస్తారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కుటుంబ వేడుక వచ్చే సూచనలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details