నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..
మేషం
ప్రారంభించే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నిఅమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధు,మిత్రుల సలహాలు అవసరం అవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.
వృషభం
ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర దర్శనం చేస్తే మంచి జరుగుతుంది.
మిథునం
శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీమీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
కర్కాటకం
తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.
సింహం
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
కన్య
ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.