Homosexual cousins married: ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇద్దరు స్వలింగ సంపర్క యువతులు పెళ్లి చేసుకున్నారు. వీరు అన్నా చెల్లెళ్ల కుమార్తెలు కావడం గమనార్హం. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భావించి కొద్ది పారిపోయి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరంలో దిల్లీలోని ఓ కాలనీలో కలిసి జీవిస్తున్నారు.
ఏం జరిగిందంటే?:ఈ యువతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. సొంత అన్నా చెల్లెళ్ల కుమార్తెలు. ఒకరు గ్రేటర్ నోయిడాలోని గ్రామంలో, మరొకరు దిల్లీలో ఉంటారు. అయితే కొద్ది రోజలు క్రితం గ్రేటర్ నోయిడా గ్రామంలోని అమ్మాయి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తమ కుమార్తెకు ఏమైందో అనే భయంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు కుటుంబసభ్యులు. అయితే అదే రోజు దిల్లీలోని మరో అమ్మాయి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వారు కూడా పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులతో యువతుల ఆచూకీ కనిపెట్టేందుకు గ్రేటర్ నోయిడా, దిల్లీ పోలుసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.