Hightension at Nagarjuna Sagar Project: తెలుగు రాష్ట్రాలు సాగు, తాగునీరు పంచుకునే.. నాగార్జునసాగర్ జలాశయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటాక ఏపీ పోలీసులు.. సాగర్ వద్దకు చేరుకున్నారు. కాపలాగా ఉన్న.. ఎస్పీఎఫ్ సిబ్బందిని గేట్లు తీయాలని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులూ అక్కడికి వచ్చారు. గేట్లు తీయాలని.. ఏపీ పోలీసులు కోరగా, ఎందుకు వచ్చారో చెప్పాలని.. తెలంగాణ పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ దశలో.. కొందరు ఏపీ పోలీసులు గేట్లు దూకారు. సీసీ కెమెరాను లాఠీతో ధ్వంసం చేశారు. ఏపీ పోలీసులు ప్రాజెక్టు 13వ క్రస్ట్ గేటు దగ్గరకు వెళ్లారు. ఇది తమ భూభాగమంటూ.. ముళ్ల కంచె వేశారు. మొత్తం 26 గేట్లుండగా, అందులో 13 గేట్లు తమవంటూ ఏపీ పోలీసులు అక్కడే కూర్చున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత- ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వాగ్వాదం - నాగార్జునసాగర్ ప్రాజెక్టు
Hightension_at_Nagarjuna_Sagar_Project
Published : Nov 30, 2023, 6:04 AM IST
|Updated : Nov 30, 2023, 6:34 AM IST
06:02 November 30
ఏపీ పోలీసులను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
Last Updated : Nov 30, 2023, 6:34 AM IST