High Court Judgement on Medical Seats Reservation in Telangana: రాష్ట్రంలో మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదివిన లేదా నివసించిన వారే స్థానికుల అన్న నిబంధనను హైకోర్టు(High Court) తప్పుపట్టింది. రాష్ట్రంలో శాశ్వతంగా ఉన్న వ్యక్తులకి ఆ నిబంధన వర్తించదని ప్రకటించింది. ఈ అంశంలో సంబంధిత అధికారుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇతర ప్రాంతాల్లో చదివినంత మాత్రాన స్థానికత వర్తించదనడం తగదని తీర్పు ఇచ్చింది.
Medical Seats Local Reservation in Telangana: జులై నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత.. నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల్లో.. కాంపిటీటివ్ అథారిటీ కోటాలోని సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 371-డీ ప్రకారం ప్రవేశ నిబంధనలను సవరించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ పేర్కొన్నారు. దీంతో 1820 మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు అదనంగా పొందుతున్నారు. జులై నెల ముందు వరకు ఉన్న నిబంధనల ప్రకాం వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా.. మిగిలిన 15 శాతం అన్‌రిజర్వుడ్ విభాగానికి చెందాయి. 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఈ సీట్లకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడుతున్నారు.