తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.135 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టివేత - norcotic smaglar shot in jammu

జమ్ముకశ్మీర్​లో మాదకద్రవ్యాల ముఠా గుట్టు రట్టు చేశాయి సరిహద్దు భద్రతా దళాలు. సుమారు రూ.135 కోట్ల విలువ చేసే హెరాయిన్​ను సీజ్​ చేశాయి.

heroin
హెరాయిన్​

By

Published : Jun 23, 2021, 9:00 AM IST

Updated : Jun 23, 2021, 10:38 AM IST

జమ్ముకశ్మీర్​ కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మాదక ద్రవ్యాల స్మగ్లర్​ను సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కాల్చి చంపారు. అతని నుంచి 27 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.135 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

స్మగ్లర్​ సరిహద్దుకు అవతలి వైపు నుంచి వచ్చినట్లు గమనించిన సిబ్బంది.. అక్కడే నిలవాలని హెచ్చరించినా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాల్చి చంపినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

పాకిస్థాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు సులభంగా భారత్​లోకి చొరబడేందుకు ఉన్న 150 మీటర్ల భూగర్భ సొరంగంను జనవరి 23న బీఎస్​ఎఫ్​ అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి:ఉగ్రవాద నిధుల కోసం భారత్‌లో డ్రగ్స్‌ దందా!

Last Updated : Jun 23, 2021, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details