Heroin in Women Body: హెరాయిన్ క్యాప్సుల్స్‌ను కడుపులోదాచి స్మగ్లింగ్ యత్నించిన వ్యక్తి అరెస్ట్ అయిన ఘటన జరిగిన కొద్ది రోజులకే.. అటువంటిదే మరోటి వెలుగులోకి వచ్చింది. శరీరంలో క్యాప్సుల్స్ రూపంలో హెరాయిన్‌ను తరలించేందుకు యత్నించిన ఓ మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.6 కోట్లు విలువ చేసే 862 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్ విమానాశ్రయంలో గతనెల 19న జరిగింది.
12 రోజుల తర్వాత..
సూడాన్‌కు చెందిన ఈ నిందితురాలి నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు 12 రోజులు పట్టింది. ఎందుకంటే ఆమె శరీరంలో మొత్తం 88 క్యాప్సుల్స్ ఉన్నాయి. నిందితురాలికి స్కానింగ్ నిర్వహించగా కొన్ని క్సాప్సుల్స్ ఆమె కడుపులో మరికొన్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో గుర్తించారు. మేజిస్ట్రేట్ నుంచి అనుమతి పొందిన అధికారులు ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 మధ్య డాక్టర్లు వీటిని వెలికి తీశారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి: రూ.56 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్.. ఎలా దొరికిందంటే?