తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఉష్ణమండల ద్రోణీ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 14 వరకు మొస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

Heavy rains lash parts of Tamil Nadu
తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు

By

Published : Jan 12, 2021, 12:12 PM IST

తమిళనాడులో వానలు విస్తారంగా పడుతున్నాయి. ఈ నెల 14 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం అత్యధికంగా అదిరామపట్నంలో 13.5 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. అరియలూర్​లో 10 సెం.మీ, నాగాపట్నంలో 8సెం.మీ, కరైకల్​లో 6.3 సెం.మీలు కురిసినట్లు పేర్కొంది.

తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఈ నెల 14 వరకు ఉష్ణమండల ద్రోణి కొనసాగుతుందని.. దీంతో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మరో రెండు రోజులు తరువాత ఈ వర్షాలు తగ్గుముఖం పడుతాయని పేర్కొంది.

తిరునెల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్​, రామనాథపురం జిల్లాల్లో ద్రోణి ప్రభావం కొనసాగనుందని ఐఎండీ స్పష్టం చేసింది. దీంతో వచ్చే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది.

ఇదీ చూడండి: సీఎం అభ్యర్థిపై నిర్ణయం వారిదే: భాజపా

ABOUT THE AUTHOR

...view details