తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rains in Telangana : శాంతించని వరుణుడు.. జోరు వానలతో ఆగమవుతున్న తెలంగాణ

Peoples Problems With Rain Telangana : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనం అవస్థలకు గురవుతున్నారు. వాగులు, చెరువు పొంగుతుండటంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి, జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి.

Rains in Telangana
Rains in Telangana

By

Published : Jul 25, 2023, 4:06 PM IST

Updated : Jul 25, 2023, 10:19 PM IST

Peoples Problems With Rain Telangana : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ భారీ వర్షాలకు పలుప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బాల్కొండ ప్రాంతంలోని మోర్తాడ్, వేల్పూర్, ఎర్గట్ల, భీంగల్‌ మండలాల్లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వేల్పూరులో 46.3సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వేల్పూర్‌ చెరువు తెగిపోవడంతో రోడ్డుపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

దీంతో ఆర్మూర్-భీంగల్‌ మార్గంలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూరు పీఎస్‌, తహసీల్దార్ కార్యాలయం, రైతు వేదికలోకి వరద నీరు చేరింది. ఆర్మూరు మండలం పీప్రీ- మంతెన మధ్య రోడ్డుపై వరదనీరు చేరింది. భీంగల్‌లోని అయ్యప్పనగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా పడకల్‌ పెద్దచెరువు కట్ట భారీ వరద వల్ల కుంగిపోయింది. దీంతో ముందస్తుగా అధికారులు మత్తడిని పగులగొట్టారు.

Heavy rain in Nizamabad : నిజామాబాద్ జిల్లా రామడుగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోపాల్, సిరికొండ, ధర్‌పల్లి, జక్రాన్‌పల్లిలో వాగులు, వంకలు పొంగుతున్నాయి.సిరికొండలో కప్పలవాగు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. ఆర్మూర్ శివారులోని జాతీయ రహదారి 63 కల్వర్టుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చేపూర్ శివారులో ర్యాంపులు పక్కకు వాలాయి. సాయిబాబా గుడి సమీపంలో జాతీయ రహదారి కోతకు గురైంది.

పెరికిట్ శివారులో 44, 63 జాతీయ రహదారులు కోతకు గురయ్యాయి. ఆర్మూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన సిసి రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. పెరికిట్లో వరదనీటి ప్రవాహానికి కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ కొట్టుకుపోయింది. చేపూర్‌లో రోడ్డు కోతకు గురై.. మెట్‌పల్లి నుంచి ఆర్మూర్ వైపు రాకపోకలకు అంతరాయం నెలకొంది. ఆర్మూర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, యోగేశ్వర కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరింది.

Kamareddy rains today : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు‌‌ పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాడ్వాయి మండలం కామారెడ్డి నుంచి బ్రహ్మణపల్లి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న బ్రిడ్జి తెగిపోయింది. గాంధారి మండలం నల్లమడుగు- రామలక్ష్మన్ పల్లి గ్రామాల మధ్య వాగు పొంగి వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

Heavy rain in Karimnagar : ఉమ్మడి కరీంనగ్‌ జిల్లాలోనూ ఎడతెరపిలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రాత్రి భారీ వర్షం కురవగా.. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ముసురు కమ్ముకుంది. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో పొంటపొలాలు నీటమునిగాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండంల రంగారావుపేట కల్వర్టు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఖమ్మం, చింతకాని, కామేపల్లి, కుసుమంచి, కొనిజర్ల, సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం గ్రామీణ మండలాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. తీర్ధాల వద్ద ఆకేరు పొంగి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుంది. ఖమ్మంలో ఉదయం నుంచి కురుస్తున్న కుండపోతకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత బస్టాండ్‌ కూడలిలో నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.

శాంతించని వరుణుడు.. జోరు వానలతో ఆగమవుతున్న తెలంగాణ

ఇవీ చదవండి:

Last Updated : Jul 25, 2023, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details