తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడ్మిషన్​ కోసం వచ్చిన విద్యార్థి తల్లితో హెడ్​మాస్టర్​ మసాజ్​ - కర్ణాటక వార్తలు

అడ్మిషన్​ కోసం వచ్చిన ఓ విద్యార్థి తల్లితో బెదిరించి మసాజ్​(massage in School) చేయించుకున్నాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా.. సస్పెండ్​ చేశారు ఉన్నతాధికారులు.

Headmaster suspended for getting massage in School
అడ్మిషన్​ కోసం వచ్చిన విద్యార్థి తల్లితో హెడ్​మాస్టర్​​ మసాజ్​

By

Published : Sep 23, 2021, 12:39 PM IST

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపిస్తారు గురువులు. కానీ కొందరు ఉపాధ్యాయులు తప్పుడు మార్గంలో నడుస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అలాంటి సంఘటనే కర్ణాటక బెంగళూరులోని ఓ ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాలలోనే ఓ ప్రధానోపాధ్యాయుడు మసాజ్(massage in School)​ చేయించుకున్నాడు. అదీ.. అడ్మిషన్​ కోసం వచ్చిన ఓ విద్యార్థి తల్లితో.. !

ఏం జరిగింది?

ఓ మహిళ తన చిన్నారికి అడ్మిషన్​ కోసం నగరంలోని కొదండరామాపుర ఉన్నత పాఠశాలకు వచ్చింది. ఈ క్రమంలో తనకు మసాజ్​ చేయాలని ఆ మహిళను ఒత్తిడి చేశాడు ప్రధానోపాధ్యాయుడు లోకేశప్ప. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. అది కాస్త వైరల్​గా మారగా.. లోకేశప్ప బాగోతం వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న బృహత్​ బెంగళూరు మహానగర పాలిక.. ఉపాధ్యాయుడిని సస్పెండ్​ చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. పని వేళల్లో తమ బాధ్యతలను మరిచి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేల్చి కర్ణాటక సివిల్​ సర్వీసెస్​ చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు. శాఖా పరమైన విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.

ఇదీ చూడండి:'ప్రజలకు చెప్పాల్సిన అధికారే... ఉల్లంఘిస్తున్నాడు!'

ABOUT THE AUTHOR

...view details