తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ ప్రధానిని స్క్రీన్​పై అలా చూసి.. ఏడ్చేసిన కుమారులు - జేడీఎస్ మండ్య పార్టీ మీటింగ్

కర్ణాటక మండ్యలో జరిగిన జేడీఎస్​ పార్టీ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్న. అనారోగ్య కారణాలతో సభకు వర్చువల్​గా హాజరైన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను తెరపై చూసి విలపించారు.

hd kumaraswamy news
దేవెగౌడను స్క్రీన్​పై చూసి కుమారుల భావోద్వేగం

By

Published : Aug 1, 2022, 11:04 AM IST

మాజీ ప్రధానిని స్క్రీన్ మీద అలా చూసి.. ఏడ్చేసిన కుమారులు

కర్ణాటక మండ్య జిల్లాలోని నాగమంగళ నియోజకవర్గంలో జేడీఎస్ పార్టీ ఆదివారం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్న పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా వర్చువల్​గా సభలో పాల్గొన్న మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడను స్క్రీన్​పై చూసి వీరిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాన్ని చూసి కార్యకర్తలు, అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

'ఐదేళ్ల పాలన పూర్తి స్థాయిలో అప్పగిస్తే రైతులను అప్పులపాలు కాకుండా ఉండేందుకు పథకాలు ప్రవేశపెట్టాలని చూశా. అయితే అది కుదరలేదు. ఇకనుంచి జేడీఎస్ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అందిస్తామో ఇంటింటికీ తెలియజేస్తాం. దేశంలోని ఆడపిల్లలు ఆత్మగౌరవంతో జీవించాలి. జేడీఎస్ నుంచి ఎదిగిన వారే మండ్యలో పార్టీని నాశనం చేయాలని చూశారు. అది ఈ జన్మలో జరగదు.

ABOUT THE AUTHOR

...view details