తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాక్టర్​ను​ బుల్లెట్​ ప్రూఫ్​గా మార్చిన రైతు

హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో ఆ రైతు నివసిస్తాడు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాల కారణంగా ఘర్షణలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఆ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన ట్రాక్టర్​ను బుల్లెట్​ ప్రూఫ్​గా మార్చాడు.

farmer
ఈ ట్రాక్టర్​ బుల్లెట్​ ప్రూఫ్!

By

Published : Mar 18, 2021, 1:26 PM IST

Updated : Mar 18, 2021, 2:35 PM IST

బుల్లెట్​ ప్రూఫ్​ ట్రాక్టర్​

హరియాణాలోని సోనీపత్​ జిల్లా ఖరమ్​పుర్​ గ్రామానికి చెందిన రాజేంద్ర అనే రైతు తన ట్రాక్టర్​ను బుల్లెట్​ ప్రూఫ్​గా తీర్చిదిద్దుకున్నాడు. ఇందుకోసం అతను ఐదు లక్షల వరకు ఖర్చు చేశాడు. దీనికి సీసీటీవీ కెమెరాలతోపాటు లోపల ఏసీ, జీపీఎస్​ను ఏర్పాటు చేశాడు.

ఆత్మ రక్షణ కోసమే ఈ ట్రాక్టర్​ను బుల్లెట్​ ప్రూఫ్​ చేశానని చెబుతున్నాడు 38 ఏళ్ల రాజేంద్ర.

ఈ ట్రాక్టర్​ బుల్లెట్​ ప్రూఫ్!

"ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా మధ్య ఎప్పటి నుంచో జలవివాదం కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్య నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ట్రాక్టర్​ను బుల్లెట్​ ప్రూఫ్ చేయించాను. గత వారం నేను నా సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపారు. ఆ సమయంలో ఈ ట్రాక్టర్​ కారణంగా మేము సురక్షితంగా బయటపడ్డాము."

-రాజేంద్ర, బుల్లెట్​ ప్రూఫ్ ట్రాక్టర్ యజమాని

ఇదీ చదవండి :1971 యుద్ధంలో విజయానికి గుర్తుగా 4 వేల కి.మీ సైకిల్ యాత్ర

Last Updated : Mar 18, 2021, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details