తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 9:40 AM IST

ETV Bharat / bharat

ఆ ఊచకోతకు కారణమైన మావోయిస్ట్​ అరెస్ట్​

చిల్క్​హరీ ఘటనలో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు కోల్హా యాదవ్​ను ఝార్ఖండ్​ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బిహార్​లోని జముయీ​ జిల్లాలో నిందితుడిని పట్టుకున్నారు.

Maoist Kolha Yadav, చిల్క్​హరీ ఊచకోత
కోల్హా యాదవ్ అరెస్ట్

ఝార్ఖండ్​లో 2007లో జరిగిన చిల్క్​హరీ ఘటనలో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు కోల్హా యాదవ్​ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడిని బిహార్​లోని జముయీ​ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఝార్ఖండ్​లోని గిరిధి జిల్లా భేల్వఘతి ఠాణాకు చెందిన బృందం బిహార్ పోలీసుల సాయంతో నిందితుడిని పట్టుకుంది.

నిందితుడిపై 18పైగా కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

గిరిధి జిల్లా చిల్క్​హరీలో 2007లో జరిగిన నక్సల్స్​ కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బాబులాల్​ మరాండి కుమారుడు కూడా ఉన్నారు.

ఇదీ చదవండి :'నలుగురిని కాదు.. 8 మందిని కాల్చి చంపాల్సింది'

ABOUT THE AUTHOR

...view details