తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారి గొంతులో అడ్డంగా హనుమాన్ విగ్రహం.. 6గంటలు నరకం.. నిమిషంలో సర్జరీ! - హింగోలీ లేటెస్ట్ న్యూస్​

చిన్న పిల్లలు ఎప్పుడు ఏం చేస్తుంటారో ఎవరూ ఊహించలేరు. కొందరు పిల్లలు ఆటలాడుతూ మట్టిని తింటుంటారు. ఇంకొందరేమో చిన్న చిన్న పిన్నులు, రూపాయి, రెండు రూపాయల కాయిన్స్​ను​ మింగేస్తుంటారు. అలాంటప్పుడు వాటిని బయటకు తీయడం కోసం డాక్టర్స్ చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఓ నాలుగేళ్ల చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

hanuman idol stuck in baby throat
hanuman idol stuck in baby throat

By

Published : Apr 3, 2023, 10:54 PM IST

చిన్న పిల్లలు తెలియనితనంతో తమ చేతికి దొరికిన చిన్నచిన్న వస్తువులను మింగేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో ఓ చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. అదేంటీ హనుమంతుడ్ని మింగడమేంటని ఆశ్చర్యపోతున్నారా! అవును.. ఓ నాలుగేళ్ల పాప తన మెడలో కట్టి ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పొరపాటున మింగేసింది. దీంతో ఆ విగ్రహం చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. అయితే ఆ పాప గొంతులో ఇరుక్కున్న విగ్రహాన్ని తొలగించి వైద్యులు చిన్నారిని కాపాడారు.

అసలేం జరిగిందంటే..?
హింగోలీ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తన మెడలో కట్టి ఉన్న 3 అంగుళాల హనుమంతుడి విగ్రహాన్ని మింగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ పాప మింగిన ఆ విగ్రహం పొట్టలోపలి వెళ్లకుండా గొంతులో అడ్డంగా ఉండిపోయింది. దీంతో పాప ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వెంటనే ఆ చిన్నారి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్​కు​ గురయ్యారు. వెంటనే తేరుకుని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి పరిస్థితిని గమనించిన అక్కడి డాక్టర్​ నాందేడ్​లోని గెలాక్సీ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్తే తప్పకుండా చిన్నారి గొంతులో ఉన్న విగ్రహాన్ని తొలగిస్తారని ఆ డాక్టర్​ వారికి చెప్పారు. దీంతో వారు తమ పాపను హుటాహుటిన నాందేడ్​లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

అయితే ఆ చిన్నారికి గొంతు నొప్పి ఎక్కువవ్వడం వల్ల.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న డాక్టర్​ నితిన్​ జోషి.. కేవలం 1:10 నిమిషాల్లోనే ఆ చిన్నారి గొంతులో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని బయటకు తీసి.. పునర్జన్మను అందించారు. ఆ హనుమంతుడి విగ్రహాం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పాప గొంతులోనే ఉంది. అయితే చిన్నారి ప్రాణాలు కాపాడిన డాక్టర్​ నితిన్​ జోషి.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారి మెడలో ఏమైనా వస్తువులు, దేవుడు విగ్రహాలు కట్టే ముందు జాగ్రత్తగా వ్యవహించాలని వారికి తెలిపారు.

కృష్ణుడ్ని మింగేసిన వీర భక్తుడు!
కొంతకాలం క్రితం కర్ణాటకలో కూడా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. బెళగావికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి పొరపాటున కృష్ణుడి విగ్రహాన్ని మింగాడు. నిత్యం బాలకృష్ణుడ్ని పూజించే ఆ వ్యక్తి.. ఓ రోజు నైవేద్యంగా ఉంచిన పంచామృతాన్ని తీర్థంగా తీసుకున్నాడు. అయితే ఆ తీర్థంతో పాటు కృష్ణుడి విగ్రహాన్ని కూడా మింగేశాడు. అయితే ఆ వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించలేదు. కొంతసేపటికి అతడి గొంతులో నొప్పి, వాపు రావడం వల్ల అనుమానం వచ్చి డాక్టర్ వద్దకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details