తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు పక్కన సగం కాలిన మృతదేహం.. బహిర్భూమికి వెళ్లిన మైనర్​ను కిడ్నాప్ చేసి.. - ఝార్ఖండ్ క్రైమ్ న్యూస్

ఝార్ఖండ్​లో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. పొలానికి వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు, బహిర్భూమికి వెళ్లిన మైనర్​పై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

half burnt body
సగం కాలిన మృతదేహం

By

Published : Oct 14, 2022, 5:15 PM IST

ఝార్ఖండ్ గుమ్లాలోని ఘఘ్రా పోలీస్ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. ఈ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. పొలానికి వెళ్తున్న స్థానికులు.. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
అదర్‌ ప్రధాన రహదారికి 400 మీటర్ల దూరంలో ఈ శవం లభ్యమైంది. పొలంలో మొదట హత్య చేసి.. అనంతరం కిరోసిన్‌ పోసి కాల్చివేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితులను గుర్తించి.. వారిని విచారిస్తున్నారు.

బహిర్భూమికి వెళ్లిన మైనర్​పై..
ఉత్తర్​ప్రదేశ్ ప్రతాప్​గఢ్​లో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఓ మైనర్​ను అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం దెల్హుపుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. అత్యాచారం అనంతరం నిందితులు.. బాధితురాలిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. ఇంటికి చేరుకున్న బాధితురాలు.. తనపై జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.

బీటెక్ విద్యార్థినిపై..
ఉత్తర్​ప్రదేశ్ సుల్తాన్​పుర్​లో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. సూరజ్ పాండే (28), రంజీత్ ఉపాధ్యాయ్ (26) అనే ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. అక్టోబరు 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జైసింగ్​పుర్​కు వెళ్లేందుకు సుల్తాన్​పుర్ రైల్వే స్టేషన్ బయట ఉన్న​ 23 ఏళ్ల విద్యార్థికి లిఫ్ట్ ఇచ్చారు ఇద్దరు యువకులు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గురువారం వెళ్లారు. అయితే నిందితుడు ఉపాధ్యాయ్​.. పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో అతడి కాలిపై కాల్పులు జరిపి పోలీసులు.. నిందితులిద్దరినీ పట్టుకున్నారు.

ఇవీ చదవండి:చేపల వ్యాపారికి జాక్​పాట్​.. అప్పు కట్టాలని నోటీసులిచ్చిన కాసేపటికే రూ.70 లక్షల లాటరీ

జ్ఞానవాపి కేసులో కీలక తీర్పు.. శివలింగం కార్బన్​ డేటింగ్​కు కోర్టు నో!

ABOUT THE AUTHOR

...view details