మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితేే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.
గతంలో కమల్ హాసన్ ఓ ప్రమాదానికి గురికాగా... ఆయన కాలుకు శస్త్రచికిత్స జరిగింది. అదే చోట ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కొద్దిరోజుల క్రితం చెన్నైలోని శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు.. జనవరి 19న ఆయన కుడికాలుకు శస్త్రచికిత్సచేసి ఇన్ఫెక్షన్ సోకిన కణజాలాన్ని తొలగించారు.