తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చనిపోయిందని పోస్టుమార్టానికి తరలింపు.. చివరి క్షణంలో..! - రోగి మృతిచెందినట్లు నిర్ధరణ

మధ్యప్రదేశ్​లో ఓ ఆస్పత్రి వైద్యులు.. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. చికిత్స కోసం వచ్చిన పేషెంట్​ను..​ బతికుండగానే మృతిచెందినట్లు నిర్ధరించారు. మరికాసేపట్లో పోస్టుమార్టం జరుగుతుందనగా రోగి బతికి ఉన్నట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

d
d

By

Published : Feb 26, 2022, 9:02 PM IST

ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తిని బతికుండగానే వైద్యులు మృతిచెందినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టంకు కూడా తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన రామ్​వతి రాజ్​పుత్​ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను ఝాన్సీలోని ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం గురువారం రాత్రి గ్వాలియర్​లోని జయారోగ్య ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు.. ఆమె మృతిచెందినట్లు శుక్రవారం ఉదయం నిర్ధరించారు. పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. అయితే రామ్​వతి శ్వాసతీసుకుంటున్నట్లు భర్త నిర్​పత్​ సింగ్​ గుర్తించారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది బాధితురాలికి చికిత్స అందించారు.

ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ఆస్పత్రి చీఫ్​ డాక్టర్ ఆర్​కేఎస్​ ధాకడ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి :చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స.. ప్రాణాలు నిలిపిన వైద్యులు

ABOUT THE AUTHOR

...view details