తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Gujarat news: మంత్రులుగా 24 మంది.. అంతా కొత్తవారే! - గుజరాత్ కేబినెట్

గుజరాత్​లో కొత్త ప్రభుత్వం (Gujarat news) కొలువుదీరింది. రాజ్​భవన్​లో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో అసెంబ్లీ మాజీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు జీతూ వఘానీ కూడా ఉన్నారు. అయితే.. మాజీ సీఎం విజయ్​ రూపానీ కేబినెట్​లోని ఒక్కరికి కూడా ఇప్పుడు చోటుదక్కకపోవడం గమనార్హం.

Gujarat cabinet
గుజరాత్ కేబినెట్

By

Published : Sep 16, 2021, 3:22 PM IST

Updated : Sep 16, 2021, 5:11 PM IST

అయిదు రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat news) పదవి నుంచి విజయ్ రూపానీని అనూహ్యంగా తొలగించి భూపేంద్ర పటేల్​ను(Bhupendra patel) నియమించిన భాజపా.. కొత్త మంత్రివర్గ ఏర్పాటులోనూ (Gujarat news) వ్యూహాత్మక పంథా అనుసరించింది. రూపానీ(Vijay Rupani) పని తీరుపై అసంతృప్తి, 2022లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోణంలో ఆయనను తొలగించారని భావిస్తుండగా.. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేలా మంత్రివర్గం ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంది. గురువారం కొత్త మంత్రులు ప్రమాణం చేయగా, రూపానీ కేబినెట్​లోని ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు.

24 మంది మంత్రులుగా ప్రమాణం

సీఎం పదవిని ఆశించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్​ పటేల్​కు​ కూడా కేబినెట్​లో చోటు కల్పించలేదు. శాసనసభ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర త్రివేది, భాజపా గుజరాత్ మాజీ అధ్యక్షుడు జీతూ వఘానీ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. మొత్తం 24 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగా, కొత్త మంత్రులతో రాజ్​భవన్​లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు.

కొలువుదీరిన గుజరాత్ కేబినెట్

మంత్రులు వీరే..

రాజేంద్ర త్రివేది, జీతూ వఘానీ, హృషికేష్ పటేల్, పూర్ణేష్ మోదీ, రాఘవ్​జీ పటేల్, కనుభాయ్ దేశాయ్, కిరీట్​సిన్హ్ రానా, నరేష్ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్ సిన్హ్ చౌహాన్.

ఇదీ చదవండి:గుజరాత్​లో​ కొత్త కేబినెట్​- మంత్రి పదవులు వీరికే..!

Last Updated : Sep 16, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details