తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ టీకాల కొరత- అక్కడ 'నో వ్యాక్సినేషన్' బోర్డులు

దేశంలో పలు చోట్ల 'నో వ్యాక్సినేషన్​​' బోర్డులు దర్శనమిస్తున్నాయి. సరిపడా డోసులు​ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు... రాష్ట్రాలకు రానున్న మూడు రోజుల్లో 24 లక్షలకుపైగా కొవిడ్​ టీకాలు అందించనున్నట్లు కేంద్రం తెలిపింది.

vaccines
నో వ్యాక్సిన్ బోర్డు, టీకాలు

By

Published : Jun 30, 2021, 3:06 PM IST

దేశంలోని అనేక చోట్ల మళ్లీ టీకాలకు కొరత నెలకొంది. మహారాష్ట్రలోని నాగ్​పుర్​ వ్యాక్సినేషన్​ సెంటర్​ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో స్థానికులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. టీకా ఎప్పుడు వేస్తారోనని ఎదురుచూస్తున్నారు.

పలు కేంద్రాల్లో టీకాల కొరత
టీకాల కోసం ఎదురుచూస్తున్న స్థానికులు

"నేను ఒక క్యాన్సర్​ బాధితురాలిని. నేను రెండో డోసు తీసుకోవాలి. దాని కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను మొదటి డోసు తీసుకుని 86 రోజులు అయ్యింది."

-శోభ, క్యాన్సర్​ బాధితురాలు, నాగ్​పుర్​

గుజరాత్ అహ్మదాబాద్​లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. వ్యాక్సిన్​లు లేవంటూ కొన్ని టీకా పంపిణీ కేంద్రాల వద్ద అధికారులు నో వ్యాక్సినేషన్​ బోర్డులు పెట్టారు. అయితే వ్యాక్సిన్​ కొరతపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానికలు అంటున్నారు. అందుకే టీకా పంపిణీ కేంద్రాల ఎదుట వేచి చూస్తున్నామని చెప్పారు.

పడిగాపులు కాస్తున్న స్థానికులు
టీకాలు లేవంటూ బోర్డు
టీకా తీసుకుంటున్న యువతి

మరో మూడు రోజుల్లో...

రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో మూడు రోజుల్లో 24 లక్షలకుపైగా కొవిడ్​ టీకాలు అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు 32 కోట్లకు పైగా టీకా డోసులు ఉచితంగా ఇచ్చినట్లు తెలిపింది.

ఖాళీగా వ్యాక్సినేషన్ కేంద్రం

ఇదీ చదవండి:ప్రైవేటు టీకా కేంద్రాలకు జులై 1 నుంచి కొత్త రూల్స్​!

ABOUT THE AUTHOR

...view details