Gujarat Elections 2022 Morbi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోర్బీ వంతెన కూలిన ఘటనలో అనేక మంది ప్రాణాలు కాపాడిన కాంతిలాల్ అమృతియా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయంతిలాల్ పటేల్‌పై 62,079 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
మోర్బీ ఘటన అనంతరం భాజపాపై అనేక విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం చూపుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ భాజపా.. సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జాకు భాజపా షాక్ ఇచ్చి వంతెన ప్రమాదంలో నదిలో దూకి మరీ ప్రజలను కాపాడిన కాంతిలాల్‌ను ప్రశంసిస్తూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. గురువారం జరిగిన కౌంటింగ్‌లో ఆయన భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంతిలాల్.. ఇప్పుడు మరోసారి విజయం సాధించారు. 1995, 1998, 2002, 2007, 2012లో భాజపా తరఫునే ఆయన శాసనసనభకు ఎన్నికయ్యారు.
ఓటమి చవిచూసిన ఆప్ సీఎం అభ్యర్థి
గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ ఓటమి చవిచూశారు. ఖాంభాలియా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. 18,000 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. భాజపా అభ్యర్థి ములుభాయ్ బేరా అక్కడ విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు సమయంలో తొలి నాలుగు రౌండ్లలో గఢ్వీ ఆధిక్యం కనబరిచారు. కానీ తర్వాత రౌండ్లలో వెనుకంజ వేశారు. చివరకు ఓడిపోయారు.
ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ గెలుపొందిన అత్యంత సంపన్న అభ్యర్థి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థి అయిన భాజపాకు చెందిన జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ గెలుపొందారు. మాన్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ సిన్హా థకోర్పై 30వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం జయంతి భాయ్ ఆస్తుల విలువ రూ.661 కోట్లు.
గెలుపొందిన అత్యంత సంపన్న అభ్యర్థి