తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోట్ల రూపాయల 'మోదీ సూట్' పరిస్థితి ఇదా? - where is modi suit now?

2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరించిన సూట్ గుర్తుందా? మోదీ సూట్​గా వార్తల్లోకెక్కిన ఆ సూట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ రికార్డు సాధించింది. రూ 4.31 కోట్లకు ఓ వజ్రాల వ్యాపారి దాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడా సూట్ పరిస్థితి ఏంటి, అదెక్కడుందన్న విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు.

modi suit in bullet proof box
మోదీ సూట్

By

Published : Aug 14, 2021, 3:47 PM IST

మోదీ సూట్

అది 2015 జనవరి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్​లో పర్యటించిన సమయం. గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన ఒబామాకు.. భారత్ ఘనమైన ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరించిన సూట్.. ప్రపంచాన్ని ఆకర్షించింది. వార్తల్లో పతాకశీర్షికలకెక్కింది. వేలంలో కోట్ల రూపాయలు పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూట్​గా నిలిచింది.

ఒబామా-మోదీ
గిన్నిస్ రికార్డు సర్టిఫికేట్

ఈ సూట్ ధర రూ.11 లక్షలు కాగా.. మోదీపై అభిమానంతో సూరత్​కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీ పటేల్ దాన్ని రూ.4.31 కోట్లకు కొనుగోలు చేశారు. ఫిబ్రవరి 20న జరిగిన వేలంలో మోదీ సూట్​ను సొంతం చేసుకున్నారు.

సూట్​పై నరేంద్ర మోదీ అన్న అక్షరాలు

ఎక్కడుందంటే?

ప్రస్తుతం వ్యాపారి కొనుగోలు చేసిన మోదీ సూట్.. ఓ ఫ్యాక్టరీలో ఉంది. ఫ్యాక్టరీ అంటే ఏదో సాధారణమైన పరిస్థితుల్లో మోదీ సూట్​ను ఉంచారని అనుకుంటే పొరపడినట్లే. చాలా జాగ్రత్తగా సూట్​ను సంరక్షిస్తున్నారు. అత్యంత సురక్షితమైన, అత్యాధునిక సాంకేతికత ఉన్న బుల్లెట్ ప్రూఫ్ బాక్స్​లో సూట్​ను ఉంచారు. కనీసం గాలి కూడా ఈ బాక్స్​లోకి దూరదు. సూట్​ను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని సంరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు లాల్జీభాయ్ పటేల్ ఈటీవీ భారత్​తో చెప్పారు.

మోదీ సూట్ బాక్స్ వద్ద లాల్జీ పటేల్

"నరేంద్ర భాయ్​ సూట్ వేసిన ఈ విగ్రహం అహ్మదాబాద్​కు చెందిన ఓ కళాకారుడు తయారు చేశారు. ఒబామా వచ్చినప్పుడు తీసిన ఫొటోల్లో మోదీ ఎలా ఉన్నారో అదే విధంగా దీన్ని రూపొందించాం. సూట్​ను చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నాం. బుల్లెట్ ప్రూఫ్ బాక్స్ తయారు చేశాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరు వచ్చినా.. ఇక్కడ ఫొటోలు దిగి సంతోషం వ్యక్తం చేస్తారు. అది మాకూ ఆనందాన్ని ఇస్తుంది."

-లాల్జీభాయ్ పటేల్, వజ్రాల వ్యాపారి

మోదీ సూట్​ను సంవత్సరానికి రెండు సార్లు శుభ్రం చేస్తారు. తన ఇంట్లోని పనివారే జాగ్రత్తగా ఈ పని చేస్తారని లాల్జీ పటేల్ తెలిపారు.

ఒబామా-మోదీ

గిన్నిస్ రికార్డు సాధించిన ఈ సూట్ అప్పట్లో వివాదాస్పదమైంది. ఖరీదైన సూట్లు ధరించే మోదీ.. పేదల గురించి ఇంకేం ఆలోచిస్తారని విపక్షాలు విరుచుకుపడ్డాయి.

ఇదీ చదవండి:'విభజన విషాద సంస్మరణ దినంగా ఆగస్టు 14'

ABOUT THE AUTHOR

...view details