తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో చావుబతుకుల్లో భర్త- వీర్యం కోసం భార్య పిటిషన్ - గుజరాత్​ హైకోర్టు తాజా వార్తలు

ఏడాది క్రితమే ఆ మహిళకు పెళ్లైంది. అంతలోనే భర్త.. కొవిడ్​ బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. భర్త వీర్యం కావాలని హైకోర్టులో ఆ మహిళ వ్యాజ్యం దాఖలు చేసింది.

wife pleads high court for covid patient sperm
వీర్యం కావాలని హైకోర్టులో మహిళ పిటిషన్​

By

Published : Jul 21, 2021, 2:24 PM IST

తక్షణమే ఓ కొవిడ్​ బాధితుడి నుంచి వీర్యాన్ని సేకరించాలని వడోదరాలోని ఓ ఆస్పత్రిని గుజరాత్​ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇన్​ విట్రో ఫెర్టిలిటీ(ఐవీఎఫ్​) విధానం ద్వారా గర్భం దాల్చేందుకు అతడి భార్యకు దాన్ని అందించాలని తెలిపింది.

అసలేమైంది?

గతేడాది అక్టోబర్​లో ఓ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే.. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా బారిన పడ్డాడు. వడోదరాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమిస్తూ వస్తోంది. అతని శరీర అవయవాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. అతడు బతికేందుకు చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో తమ బంధాన్ని బిడ్డ రూపంలో సుస్థిరం చేసుకోవాలని ఆశించిన మహిళ.. భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్​ విధానంలో తల్లి కావాలని భావించింది.

వైద్యులు ససేమిరా..

అయితే.. కొవిడ్​తో బాధితుడైన సదరు వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించేందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. న్యాయస్థానం ఆదేశిస్తేనే తాము అతడి వీర్యాన్ని సేకరిస్తామని చెప్పారు. దాంతో ఆ మహిళ.. గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించింది.

మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్​ అశుతోష్​ జే శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం.. సదరు కొవిడ్​ బాధితుని నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని నిర్దేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దాన్ని తగిన విధంగా భద్రపరచాలని సూచించింది.

ఇదీ చూడండి:పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత

ఇదీ చూడండి:సెల్​ఫోన్ టార్చ్ వెలుతురులోనే రోగికి చికిత్స

ABOUT THE AUTHOR

...view details