తెలంగాణ

telangana

ETV Bharat / bharat

700 అడుగుల లోతు బోరుబావిలో బాలిక.. రక్షించిన ఆర్మీ - బోరుబావిలో బాలిక

Girl fell into borewell: 12 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన ఘటన గుజరాత్​లోని సురేంద్రనగర్​లో జరిగింది. సుమారు ఐదుగంటల పాటు శ్రమించిన సహాయక సిబ్బంది.. బాలికను సురక్షితంగా బయటకు తీశారు.

girl fell into borewell
సహయక చర్యలు చేపట్టిన సిబ్బంది

By

Published : Jul 29, 2022, 3:47 PM IST

Updated : Jul 29, 2022, 4:19 PM IST

700 అడుగుల లోతు బోరుబావిలో బాలిక.. రక్షించిన ఆర్మీ

Girl fell into borewell: గుజరాత్​ సురేంద్రనగర్​లో 12 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. బోరుబావి లోతు సుమారు 700 అడుగులు ఉండగా.. 60 అడుగుల వద్ద బాలిక చిక్కుకుపోయింది. సుమారు ఐదుగంటల పాటు శ్రమించిన సహాయక సిబ్బంది.. బాలికను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన ధ్రంగధ్ర తాలుకాలోని గంజన్వావ్​ గ్రామంలో జరిగింది.

బాలికకు చికిత్స అందిస్తున్న వైద్యులు
సహయక చర్యలు చేపట్టిన సిబ్బంది

"ఆర్మీ జవాన్ల సహాయంతో బాలికను సురక్షితంగా బయటకు తీశాం. దీనికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. బోరుబావి సుమారు 700 అడుగుల లోతు ఉంది. అదృష్టవశాత్తు బాలిక 60 అడుగుల లోతులేనే చిక్కుకుపోయింది"

-టీబీ హిరానీ, పోలీస్​ అధికారి

శుక్రవారం ఉదయం ఏడున్నర సమయంలో బాలిక బోరు బావిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని బోరుబావిలోకి ఆక్సిజన్​ను సరఫరా చేశారు. కెమెరాల సాయంతో బాలిక ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఐదు గంటల తర్వాత ఆమెను బయటకు తీసిన వెంటనే హుటాహుటిన ధ్రంగధ్ర​ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ధ్రంగధ్రలో రెండు నెలల క్రితమే ఓ బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడగా ఆర్మీ జవాన్లు వచ్చి రక్షించారు. సుమారు 3 గంటలు శ్రమించి బాలుడిని బయటకు తీశారు.

బాలికకు చికిత్స అందిస్తున్న వైద్యులు

ఇవీ చదవండి:కిడ్నాప్ చేసి మైనర్​పై గ్యాంగ్ రేప్.. రాత్రంతా నరకం!

'కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్.. లిఫ్ట్​లో ఉండగానే ముమ్మారు తలాక్!'

Last Updated : Jul 29, 2022, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details