తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా 10వేలు పెరిగిన కొవిడ్‌ మరణాలు! - కొవిడ్​ వార్తలు తాజా

Gujarat Covid Deaths: గుజరాత్​లో కరోనా మరణాలు ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 10,098గా ఉన్న మరణాల సంఖ్య 19,964కు చేరింది. సుప్రీంకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

gujarat
గుజరాత్

By

Published : Dec 13, 2021, 8:51 PM IST

Gujarat Covid Deaths: గుజరాత్‌లో కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఒక్కసారిగా సుమారు పదివేలు పెరిగింది. దీంతో అధికారిక లెక్కల ప్రకారం 10,098గా ఉన్న కొవిడ్‌ మరణాల సంఖ్య 19,964కు చేరింది. కొవిడ్‌ మృతులకు పరిహారం అంశంపై సుప్రీంకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన జాబితాలో ఈ విషయం వెలుగు చూసింది. గుజరాత్‌లో అసాధారణంగా పెరిగిన మరణాల సంఖ్యతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4.85 లక్షలకు చేరింది.

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్‌ ఈ సందర్భంగా అఫిడవిట్‌ దాఖలు చేశాయి. కొవిడ్‌ పరిహారం కోసం మొత్తం 34,678 దరఖాస్తులు వచ్చాయని, 19,964 దరఖాస్తులకు రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లించినట్లు గుజరాత్‌ పేర్కొంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కొవిడ్‌ పరిహారం కోసం 87వేల దరఖాస్తులు రాగా.. 8000 కేసుల విషయంలో చెల్లింపులు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. దీనిపై ఒకింత అసహనం వ్యక్తంచేసిన సర్వోన్నత న్యాయస్థానం.. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఇదీ చూడండి :Third wave in India: ఒమిక్రాన్​తో కొవిడ్ థర్డ్ వేవ్ వస్తుందా? నిపుణుల మాటేంటి?

ABOUT THE AUTHOR

...view details