తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు గుజరాత్​ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు - turesday gujarat counting

గుజరాత్​లో నేడు స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి అధికారులు కౌంటింగ్​ను మొదలు పెట్టనున్నారు. ఆదివారం 8,235 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Gujarat Civic Polls Counting of votes on tuesday
నేడు గుజరాత్​ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు

By

Published : Mar 2, 2021, 5:19 AM IST

గుజరాత్​ స్థానిక పోరులో బరిలోకి దిగిన అభ్యర్థుల భవితవ్యం నేడు(మంగళవారం) తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో 52.82 శాతం ఓటింగ్​ నమోదు కాగా.. జిల్లా పంచాయతీల్లో 58.82 శాతం, తాలుకా పంచాయతీల్లో 66.6 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది.

మొత్తం 8,747 స్థానాలకు గాను 8,235 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఇదీ చదవండి:రహదారి విస్తరణ కోసం రణం.. పోలీసులపైకి రాళ్లు

ABOUT THE AUTHOR

...view details