తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో గ్రెనేడ్​ దాడి- ఆరుగురికి గాయాలు

Grenade Attack in Pattan Singpora
కశ్మీర్​లో గ్రెనేడ్​ దాడి

By

Published : Dec 9, 2020, 10:10 AM IST

Updated : Dec 9, 2020, 11:24 AM IST

10:02 December 09

కశ్మీర్​లో గ్రెనేడ్​ దాడి- ఆరుగురికి గాయాలు

ఉత్తర కశ్మీర్​లోని బారముల్లా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రత బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి.  

జిల్లాలోని పత్తన్​ సింగ్​పొరా మార్కెట్​ ప్రాంతంలో ఉదయం 10 గంటల సమయంలో గ్రెనేడ్​ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.  

" సింగ్​పొరా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్​ దాడి చేశారు. అయితే.. వారు అనుకున్న లక్ష్యంలో కాకుండా రోడ్డుపై పడి పేలిపోయింది. ఇందులో ఐదు నుంచి ఆరుగురు స్థానికులు గాయపడినట్లు తెలిసింది." 

        - పోలీసు అధికారి.

క్షతగాత్రులను పత్తాన్​లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు అధికారులు. దాడికి పాల్పడిన ముష్కర మూకలను పట్టుకునేందుకు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నట్లు వెల్లడించారు.

Last Updated : Dec 9, 2020, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details