కరోనా టీకాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. వ్యాక్సినేషన్ కోసం సీరం సంస్థ, భారత్ బయోటెక్‌తో కేంద్రం వేర్వేరుగా అవగాహన ఒప్పందాలను ఖరారు చేసుకోనుంది. ఈ ప్రక్రియ వారంలోపే జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: కొవాగ్జిన్‌కు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్.. త్వరలోనే పంపిణీ
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా.. క్లినికల్ ట్రయల్స్ సంతృప్తికరంగా ఉన్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్ అడ్వైజర్ డా. సునీలా గార్గ్ ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో స్పష్టం చేశారు.