దివ్యాంగుల విద్య, పునరావాస శాస్త్ర బోధనలో దేశంలోనే తొలి విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనపై విద్యావేత్తలు, మేథావులు, విద్యార్థులు అభిప్రాయాలను జనవరి 3లోపు తెలపాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
దివ్యాంగుల కోసం ప్రత్యేక వర్సిటీ - కేంద్రం ప్రణాళిక - దివ్యాంగులు
దివ్యాంగుల విద్య, పునరావాస శాస్త్ర బోధనకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు' యూనివర్సిటీ ఆఫ్ డిసెబిలిటీ స్టడీస్ అండ్ రిహాబిలిటేషన్ సైన్స్స్, 2021' అనే పేరుతో ఒక ముసాయిదాను తయారు చేసింది కేంద్ర సామాజిక న్యాయ శాఖ.
దివ్యాంగుల విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం
అసోంలోని కామరూప్ జిల్లాలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. దివ్యాంగుల విద్య, పునరావాస శాస్త్రానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ నుంచి పరిశోధన వరకు ఇక్కడ బోధన ఉండనుంది. ఆడియాలజీ, మూగవారు మాట్లాడే మెళకువ, మానసిక శాస్త్రం, నర్సింగ్ సహా 8 రకాలైన అంశాలకు సంబంధించిన విద్యను ఇక్కడ సమ్మిళిత విధానం, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధిస్తారు.
ఇదీ చదవండి :కరోనా కాలంలోనూ అదరగొట్టిన రైల్వే!