తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమే'

ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మి దేశ ఆర్థిక భద్రతను కేంద్రం సంక్షోభంలోకి నెట్టివేస్తోందని కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ‌సంఘాల సమాఖ్య చేపట్టిన సమ్మెకు రాహుల్​ మద్దతునిచ్చారు.

By

Published : Mar 16, 2021, 12:42 PM IST

Govt privatising profit & nationalising loss, says Rahul; supports bank strike
కేంద్రం లాభాన్ని ప్రైవేటీకరణ చేస్తూ నష్టాలని జాతీయీకరణచేస్తోందన్న రాహుల్​ గాంధీ

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. కేంద్రంపై ఎదురుదాడి చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమేనని ఆరోపించారు. ప్రైవేటీకరణ అయితే లాభం, జాతీయీకరణ అయితే నష్టమన్న ప్రభుత్వ వైఖరిని రాహుల్‌ తప్పుపట్టారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు సంఘాల సమాఖ్య ఈనెల 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. ఆందోళనబాట పట్టిన బ్యాంకు ఉద్యోగులకు. రాహుల్‌ ట్విట్టర్‌ ద్వారా మద్దతు ప్రకటించారు.

ఇదీ చదవండి:'ఐరాస డిక్లరేషన్​కు వ్యతిరేకంగా సాగు చట్టాలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details