కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఇచ్చే నెలవారీ ఆర్థిక సాయాన్ని రెండింతలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం వారికి రూ. 2వేలు ఇస్తుండగా.. దానిని రూ. 4వేలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మరికొన్ని వారాల్లో ప్రతిపాదన ఆమోదం కోసం కేబినెట్‌కు పంపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలకు స్టయిఫండ్‌ను 2వేల నుంచి 4వేలకు పెంచాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది.