ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
15:12 February 03
ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
రైతు ఉద్యమంలో పాల్గొన్న నాయకుల ఖాతాల విషయంలో ట్విట్టర్ తీరుపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ట్విట్టర్ ఖాతాల నిలుపుదలపై ఆదేశాలు పాటించకపోవడంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
తొలుత రైతుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో పలు ఖాతాలను ట్విట్టర్ అధికారులు నిలిపివేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే నిలిపివేసిన ఖాతాలను పునరుద్ధరించింది సామాజిక దిగ్గజం. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి.. నోటీసులు జారీ చేసింది.