తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Market Approval: బహిరంగ​ మార్కెట్​లోకి కొవిషీల్డ్, కొవాగ్జిన్! - కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు

Market Approval Covaxin Covishield: కొవిషీల్డ్​, కొవాగ్జిన్‌ టీకాలకు రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇవ్వాలని నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ రెండు కొవిడ్​-19 వ్యాక్సిన్​లకు ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతులు మంజూరయ్యాయి.

Covishield, Covaxin
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు

By

Published : Jan 20, 2022, 5:28 AM IST

Updated : Jan 20, 2022, 6:51 AM IST

Market Approval Covaxin Covishield: కొవిషీల్డ్​, కొవాగ్జిన్‌ టీకాలకు పూర్తిస్థాయి మార్కెట్‌ అనుమతులు మంజూరు చేయాలని నిపుణుల కమిటీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐకు)కు సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కొవాగ్జిన్​,కొవిషీల్డ్​కు రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇవ్వాలని ఫార్మా సంస్థలు భారత్ బయోటెక్, సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా.. డీసీజీఐకు ఇదివరకే లేఖ రాశాయి. వ్యాక్సిన్‌కు సంబంధించిన రసాయన, తయారీ వివరాలతో పాటు.. క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచినట్టు వెల్లడించాయి.

అయితే క్లినికల్ పరీక్షలకు సంబంధించిన పూర్తి డేటాను భారత్‌ బయోటెక్‌ ఇంకా సమర్పించాల్సి ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొవాగ్జిన్‌, కోవిషీల్డ్ టీకాలకు ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతులు మంజూరయ్యాయి.

ఇదీ చూడండి:అరుణాచల్​ ప్రదేశ్ యువకుడ్ని​ అపహరించిన చైనా ఆర్మీ!

Last Updated : Jan 20, 2022, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details