భారత్‌లో తమ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా సంస్థ ఫైజర్ చేసిన అభ్యర్థనను కేంద్రం పరిశీలిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆమోదంపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఫైజర్‌తో ఒప్పందం గురించి మాట్లాడిన ఆయన.. వచ్చే కొన్ని నెలల్లో ఫైజర్ అందుబాటులోకి తీసుకురానున్న టీకా డోసులును గుర్తు చేశారు. జులై నుంచి పూర్తి స్థాయిలో వినియోగం లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
'ప్రభుత్వం నుంచి సంస్థ కోరుకునేది ఏంటో మేము చూస్తున్నాము. అలాగే వారి నుంచి మేము కోరుకునేది వారు కూడా చూస్తా ఉన్నారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తాం' అని వీకేపాల్ అన్నారు. అలానే వారు భారత్‌కు వచ్చి లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
విదేశీ ఔషధ సంస్థ ఫైజర్.. భారత్‌కు ఈ ఏడాదిలోనే 5 కోట్ల టీకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించింది. కానీ పలు నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది.