కేరళ విశ్వవిద్యాలయాల వీసీ నియామకాల్లో గవర్నర్ రాజకీయంగా జోక్యం చేసుకుంటున్నారన్న సీఎం పినరయి విజయన్ చేసిన ఆరోపణలను గురువారం ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. అందుకు ఒక్క ఉదాహరణ చూపించిన తాను రాజీనామా చేస్తానన్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయగలరా అని బహిరంగంగా సవాలు విసిరారు.
"ముఖ్యమంత్రి కార్యాలయమే రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోంది. దీంట్లో సీఎం జోక్యం ఉందనడానికి రుజువులు ఉన్నాయి. ఇదంతా నేను చూస్తునే ఉన్నాను. దీనిపై పుస్తకాలు సైతం వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు కన్నూర్ విశ్వవిద్యాలయంలో తమ బంధువులను ఎటువంటి అర్హత లేకున్నా నియమించుకోవాలని వీసీని ఆదేశించారు." అని గవర్నర్ అన్నారు.