తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2021, 10:43 AM IST

Updated : Apr 17, 2021, 10:57 AM IST

ETV Bharat / bharat

'రైతు ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాల ఏర్పాటు!'

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం) డిమాండ్​ చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైతులు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది.

Government should start vaccination centres at protest sites
'రైతు ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాల ఏర్పాటు!'

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతాల్లో వెంటనే టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం) డిమాండ్​ చేసింది. వైరస్​ వ్యాప్తి దృష్ట్యా ఉద్యమ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఎస్​కేఎం నేతలు కోరారు.

"రైతులు మాస్కులు ధరించాలి. కొవిడ్-19 నిబంధనలను పాటించాలి. ఎవరైనా రైతులు టీకాలు వేయించుకోవాలనుకుంటే మేము అడ్డుకోం. అది వారి వ్యక్తిగత విషయం."

-- ఎస్​కేఎం నేతలు

గతంలో తాము కొవిడ్-19కు భయపడబోమని రైతులు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీకాను తీసుకోబోమని స్పష్టం చేశారు.

కానీ.. కొన్ని రోజులకు భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయత్​ కూడా వ్యాక్సిన్​ వేయించుకున్నారు.

ఇదీ చదవండి :'రాజ్యంగాన్ని కాపాడడంలో దీదీ విఫలం'

Last Updated : Apr 17, 2021, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details