దివ్యాంగులకు ఉద్యోగ కోటా నుంచి.. పలు పోలీసు సర్వీసులు, సాయుధ విభాగాల్లో కొన్ని పోస్టులను, దేశంలోని పలు ప్రాంతాలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు అందులో పేర్కొంది.
ఇండియన్ పోలీస్ సర్వీస్, భారత రైల్వే భద్రతా దళం కేటగిరీ కిందకు వచ్చే అన్ని పోస్టులు.. సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్ వంటి సాయుధ విభాగాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దిల్లీ సహా అయిదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్ని కేటగిరిల్లోని పోస్టులను కూడా దివ్యాంగుల ఉద్యోగ కోటాను మినహాయించింది.