ఆస్ట్రేలియా ప్రభుత్వం సుహృద్భావాన్ని చాటుకుంది. ప్రాణాంతక మూత్రపిండ వ్యాధితో బాధపుడతున్న భారత విద్యార్థి అర్ష్దీప్ స్వదేశానికి చేరుకోవడానికి ఆదివారం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వ సమన్వయంతో క్వాంటస్ విమానంలో అతడి కోసం వైద్య పరికరాలనూ అందుబాటులో ఉంచింది. అతడిని భారత్కు తిరిగి పంపించాలని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ కూడా విజ్ఞప్తి చేసింది.
మెల్బోర్న్లో చదువుతున్న 25 ఏళ్ల అర్ష్దీప్.. ప్రాణాంతక క్రోనిక్ రీనల్ ఫేల్యూర్తో బాధపడుతున్నాడు. అతడికి వెంటనే చికిత్స అందించి, డయాలసిస్ ప్రారంభించినందుకు ఆస్ట్రేలియా, భారత ప్రభుత్వాలు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు అర్ష్దీప్ తల్లి ఇంద్రజీత్ కౌర్. చాలా రోజులు ఎదురుచూసిన తర్వాత అతడు భారత్ తిరిగిరావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు.