తెలంగాణ

telangana

మెకానిక్​కు రూ. 70కోట్ల జీఎస్​టీ ఎగవేత నోటీసులు

పైపులు మరమ్మతు చేసే ఓ మెకానిక్​కు జీఎస్​టీ అధికారులు షాకిచ్చారు. ఒడిశాకు చెందిన సమీర్​ జోజో అనే వ్యక్తి రూ. 70 కోట్ల మోసానికి పాల్పడినట్లు నోటీసులు పంపారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

By

Published : Nov 7, 2020, 6:57 AM IST

Published : Nov 7, 2020, 6:57 AM IST

goods and service tax officials given notices to mechanic to pay 70cr
రూ. 70కోట్ల జీఎస్టీ ఎగవేసినట్లు మెకానిక్​కు నోటీసులు

ఒడిశాలోని సుందర్​గఢ్​ జిల్లా రవుర్కెలకు చెందిన సమీర్​ జోజో​ అనే వ్యక్తికి జీఎస్​టీ ఎగవేత కింద అధికారులు నోటీసులు పంపారు. అందులో రూ.70 కోట్ల మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.

ఈ విషయంపై ఆ మెకానిక్​ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఆరునెలల క్రితం ఓ వ్యక్తి వచ్చి స్థానిక కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన గుర్తింపు పత్రాలు, చెక్కులపై సంతకాలు తీసుకెళ్లాడని చెప్పారు జోజో. ఆ వ్యక్తి ఆ తరువాత మళ్లీ కనిపించలేదన్నారు. అతనే తన పేరట కంపెనీ ఏర్పాటు చేసి పన్ను ఎగవేసి ఉండొచ్చని నోటీసులు ద్వారా తెలుస్తోందని వెల్లడించారు. మెకానిక్​గా పనిచేసే తన వద్ద అంత డబ్బు ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:70మంది సెక్స్​వర్కర్లను కాపాడిన కానిస్టేబుల్

ABOUT THE AUTHOR

...view details