మధ్యప్రదేశ్లోని ఛత్తర్పుర్ జిల్లాలో ఇటీవల మేక పాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ. 30 నుంచి 40 మధ్య లభించే లీటర్ పాలు ఇప్పుడు రూ.300 నుంచి 400కి చేరుకున్నాయి. ఈ స్థాయిలో ధరలు పెరగడం వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం..
రాష్ట్రంలో డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులోనూ ఛత్తర్పుర్ సహా సమీప జిల్లాల్లో వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది. మేక పాలు తాగితే డెంగీ నయం అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో.. పలు చోట్ల మేక పాలు దొరకడం కూడా కష్టమవుతోందని అంటున్నారు స్థానికులు.