Goa ministers criminal cases: గోవాలో భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తెలిపింది. వీరిలో ముగ్గురు మంత్రులపై తీవ్రమైన నేరాభియోగాలు నమోదైనట్టు పేర్కొంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో పాటు మొత్తం తొమ్మిది మంది మంత్రులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను గోవా ఎలక్షన్ వాచ్, ఏడీఆర్ సంయుక్తంగా విశ్లేషించి నివేదికను విడుదల చేశాయి. ఏడీఆర్ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం.. గోవాలో నలుగురు (44శాతం) మంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా.. ముగ్గురు (33శాతం) మంత్రులు మాత్రం తీవ్రమైన నేరాభియోగాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన నేరాలు అంటే కనీసం ఐదేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్షపడే కేసులని ఏడీఆర్ పేర్కొంది.
ఆ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులంతా కోటీశ్వరులే! - గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
Goa ministers criminal cases: గోవాలో కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తెలిపింది. అలాగే, గోవాలోని ప్రమోద్ సావంత్ కేబినెట్‌లో మంత్రులంతా కోటీశ్వరులేనని ఏడీఆర్ వెల్లడించింది.
గోవా మంత్రివర్గం
అలాగే, గోవాలోని ప్రమోద్ సావంత్ కేబినెట్‌లో మంత్రులంతా కోటీశ్వరులేనని వెల్లడించింది. సీఎంతో పాటు మొత్తం తొమ్మిది మంది మంత్రుల ఆస్తుల విలువ సగటున రూ.19.49 కోట్లుగా ఉంటుందని తెలిపింది. పనాజీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అటానాసియో బాబుష్ మాన్‌సెరేట్ రూ.48.48 కోట్లతో ధనిక మంత్రిగా నిలవగా.. ప్రియోల్ నుంచి ఎన్నికైన గోవింద్ షేపు గౌడ్ 2.67కోట్ల ఆస్తితో ఆఖరి స్థానంలో ఉన్నారని పేర్కొంది.
ఇదీ చదవండి:విపక్షాల ఐక్యతకు దీదీ పిలుపు.. ఆ పార్టీలకు లేఖ