గోవాలో మళ్లీ భాజపానే.. వారి సాయంతో ప్రభుత్వం ఏర్పాటు!
Goa assembly polls 2022: గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మెజారిటీ స్థానాలుకు ఒక్క అడుగు దూరంలో భాజపా నిలిచింది. అయితే, స్వతంత్రుల మద్దతుతో అధికారాన్ని చేపట్టనుంది భాజపా.
గోవా అసెంబ్లీ ఎన్నికలు
By
Published : Mar 10, 2022, 3:08 PM IST
|
Updated : Mar 10, 2022, 6:45 PM IST
Goa assembly polls 2022: గోవాలో భాజపా మరోమారు అధికారం చేపట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ స్థానాలకు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయినా.. స్వతంత్రుల మద్దతుతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
పార్టీలు గెలుపొందిన స్థానాలు
పార్టీ
గెలుపొందిన సీట్లు
భాజపా
20
కాంగ్రెస్
12
టీఎంసీ
2
ఆప్
2
ఇతరులు
4
స్వతంత్ర అభ్యర్థుల మద్దతు
40 అసెంబ్లీ స్థానాల్లో భాజపా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు స్వతంత్ర అభ్యర్థులు. బిచోలిమ్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ చంద్రకాంత్ శెట్టి భాజపాకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. కొర్టాలిమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అలెక్జియో రెజినాల్డో తన మద్దతు ప్రకటించారు.
"మా పార్టీ 20 సీట్లు గెలుచుకుంది. మద్దతు ఇస్తామని మహారాష్ట్ర గోమంతక్ పార్టీ లేఖ ఇచ్చింది. మరో ముగ్గురు స్వతంత్రులు కూడా మాకు మద్దతు తెలిపారు. అంటే ఇప్పుడు మా బలం 20+3+2=25. మరింత మంది మాతో జట్టుకట్టే అవకాశముంది. కాబట్టి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం" అని తెలిపారు భాజపా నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.