abortion YouTube video: గర్భాన్ని కుటుంబ సభ్యుల నుంచి దాచేందుకు తనపై తానే ప్రయోగాలు చేసుకుని, ప్రాణాలు మీదకు తెచ్చుకుంది ఓ యువతి. యూట్యూబ్‌లో చూసి గర్భం తొలగించుకోవాలని భావించింది. చివరకు ఆమెకు అబార్షన్ అయింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని నార్ఖేడ్ తాలుకాలో ఈ ఘటన జరిగింది. నార్ఖేడ్కు చెందిన 17 ఏళ్ల బాలిక ఆరు నెలల క్రితం తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. శారీరక కలయిక ద్వారా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పింది. ఆ యువకుడు కొన్ని మందులు తీసుకుంటే.. అబార్షన్ అవుతుందని చెప్పాడు. అవి బయట దొరకలేదు.
girl abortion watching YouTube: దీంతో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసిపోతుందని భయపడిన బాలిక.. యూట్యూబ్‌లో అన్వేషణ ప్రారంభించింది. ఓ ఔషధం తీసుకుంటే అబార్షన్ అవుతుందని ఓ వీడియోలో చెప్పేసరికి దాన్ని పాటించింది బాలిక. కానీ, ఈ వ్యూహం బెడిసికొట్టింది. బాలిక ఆరోగ్యం పాడైంది. అనుమానం వచ్చి ఆరా తీసిన తల్లికి.. విషయం చెప్పేసింది బాలిక. దీంతో వెంటనే కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లింది.